
ఇటీవలే “ఓజీ” బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో పవన్ మళ్లీ టాప్ గేర్‌లోకి వెళ్లిపోయారు. ఈ క్రేజ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించిన దిల్ రాజు, తన సర్కిల్‌లో ఉన్న డైరెక్టర్లతో కలిసి ‘పవన్‌కు సరిపోయే డైరెక్టర్ ఎవరు?’ అనే అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ చర్చల్లో చివరికి ఒకే పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది — అనిల్ రావిపూడి! అనిల్ రావిపూడి పేరు బయటకు రాగానే పవన్ ఫ్యాన్స్ మాత్రం కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ డ్రామాలే. “పటాస్”, “సరిలేరు నీకెవ్వరు”, వంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి మాత్రం మాస్ యాక్షన్ టచ్ కావాలి అని అభిమానులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ. “పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అవసరం. అలాంటి క్రేజ్‌ను ఉపయోగించుకునేలా దిల్ రాజు గారు ఎంచుకోవాలి” అంటూ ఫ్యాన్స్ బహిరంగంగా సూచిస్తున్నారు. అయితే దిల్ రాజు మాత్రం అభిమానుల మాటలు పక్కన పెట్టి, అనిల్ రావిపూడినే ఫైనల్ చేసేశాడట.ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం “మన శంకర వరప్రసాద్ పండక్కి వచ్చేస్తున్నారు” అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లేదా రిలీజ్ తర్వాత జరిగే సక్సెస్ సెలబ్రేషన్స్ లోపలే పవన్ కళ్యాణ్ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని టాక్.
“దిల్ రాజు తీసుకుంటున్న ఈ నిర్ణయం పవన్ ఇమేజ్‌కు సూట్ అవుతుందా?” అనే డౌట్‌తో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కొందరు అయితే నేరుగా కామెంట్ చేస్తున్నారు —“అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దిశలోనే నడుస్తాడు. పవన్ ఇమేజ్ మాస్ అండ్ పవర్‌ఫుల్. ఈ కాంబినేషన్ మిస్‌మ్యాచ్ అవుతుందేమో!” అంటున్నారు. మరి దిల్ రాజు ఈసారి పవన్ క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటాడా, లేక అభిమానులు చెబుతున్నట్లుగా “గేమ్ ఛేంజర్ ” ప్రయత్నం బొక్క పెట్టేస్తుందా అనేది చూడాలి..??