ప్రదీప్ రంగనాథన్ హీరోగా కార్తీశ్వరన్ డైరెక్షన్లో రూపొందిన మూవీ డ్యూడ్ . movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి కానుకగా తెలుగు మరియు తమిళ అదే విధంగా హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది . ప్రేమలు మూవీ అద్భుతమైన విజయం అనంతరం ప్రదీప్ సరసన నటించిన మమిత బైజు .. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకోవడం జరిగింది .


ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. " లవ్ టుడే మరియు డ్రాగన్ లాంటి రెండు వరుస హిట్లను అందించిన ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు . ప్రేమలు రిలీజ్ అనంతరం మేకర్స్ నన్ను సంప్రదించారు . అనంతరం దర్శకుడు కీర్తిశ్వరన్ తో మీటింగ్ జరిగింది . ఆయన కథ చెప్పినా తీరు మరియు కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చాయి " అంటూ వెల్లడించింది . ఇక ఈ కథలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని మరియు కూరల్ పాత్ర చాలా డిఫరెంట్ గా మరియు ఆసక్తికరంగా ఉంటుందని ఆమె తెలిపింది . " కూరలు చాలా విజయవంతమైన పాత్ర . తన బావుద్వేగాల పట్ల నిబందతగా ఉంటుంది . చుట్టూ ఉన్న వారందరితో స్నేహితంగా ఉంటుంది .


చాలా సూటిగా మాట్లాడుతుంది కూడా . ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు నేను . అందుకే ఇది ఒక మంచి అనుభూతిని ఇచ్చింది . ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ నాకు నవ్వుగా అనిపించాయి . వాటి కోసం రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి షూట్ సమయంలో ఆందోళన లేకుండా సీన్ మీద ఫోకస్ చేశాను . నేను ఎప్పుడూ షూట్ కు ముందు బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలని చూసుకుంటాను . అందుకే ఈ పాత్ర ఒకేసారి నవ్వులుగా మరియు ఉత్సాహంగా అనిపించింది " అంటూ మమిత కామెంట్స్ చేసింది . ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: