సెలబ్రెటీలు అందరూ కోట్ల ఆస్తులు సంపాదించేది ఎవరికోసం వారి పిల్లల కోసమే కదా..సెలబ్రిటీలు ఏంటి ప్రతి ఒక్క తల్లి తండ్రి డబ్బులు సంపాదించేది వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కోసం కదా.. అవును పిల్లల కోసమే తల్లిదండ్రులు కష్టపడతారు. కానీ ఈ నటుడు మాత్రం కడుపున పుట్టిన పిల్లలు ఉన్నా కూడా ఓ పనిమనిషికి ఆస్తి రాసిచ్చారట. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. పనిమనిషికి ఆస్తి రాసి ఇచ్చారంటే ఆ నటుడుకి ఆ పనిమనిషితో ఏదైనా ఎఫైర్ ఉంది కావచ్చు అనుకుంటారు ఈ విషయం తెలియడంతోనే.కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.అయితే ఆ పనిమనిషికి ఆస్తి రాసిచ్చిన ఆ నటుడు ఎవరు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రముఖ నటుడు రంగనాథ్ అంటే తెలియని వారు ఉండరు.ఈయన ప్రస్తుతం మన ముందు లేకపోయినప్పటికీ ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు.

అలా ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఈయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. రాణించారు. వెంకటేష్ నటించిన కలిసుందాం రా సినిమాలో శ్రీహరి తండ్రి పాత్రలో నటించింది ఈయనే. అలా ఎన్నో హిట్ సినిమాల్లో రాణించిన రంగనాథ్ చివరికి సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. కోట్ల ఆస్తులు సంపాదించిన ఈయన సూసైడ్ ఎందుకు చేసుకున్నారో తెలియదు కానీ సూసైడ్ చేసుకున్న సమయంలో గోడపై తన పనిమనిషికి ఆస్తి ఇవ్వమని ఆమెని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని కూడా రాశారు.అయితే అలా రాసి చనిపోవడానికి కారణం బతికున్న సమయంలో పనిమనిషి ఆయనకు ఎన్నో సేవలు చేసిందట. ముఖ్యంగా తన భార్య మంచాన పడ్డ తర్వాత పనిమనిషి ఎన్నో సపర్యలు చేసిందట.
అలా పనిమనిషి చేసిన సేవని గుర్తుంచుకొని చనిపోయాక ఆమెకు న్యాయం చేయాలని అలా ఆస్తి రాసిచ్చారట. ఇక రంగనాథ్ తన భార్య చనిపోయాక మరింత కృంగిపోయాడని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.ఇక రంగనాథ్ కి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయే సమయంలో గోడమీద నా బ్యాంకులో ఆంధ్రా బ్యాంకు బాండ్స్ ఉన్నాయి.అవి నా ఇంట్లో పని చేసే పనిమనిషి మీనాక్షికి అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్ అని రాశారు.అంతే కాదు రంగనాథ్ చనిపోయే ముందు తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి నేటి నిజం ఎడిటర్ బైసా దేవదాస్ కి గుడ్ బై సార్ అంటూ మెసేజ్ కూడా పంపించారట. అలా దాదాపు 300 సినిమాల్లో నటించిన రంగనాథ్ చివరికి 2015లో తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: