
ప్రస్తుతం కూడా నిహారిక వరుస సినిమాలను నిర్మిస్తూ, తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతోంది. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ రోజు తన బావ అయిన సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నిహారిక ఒక స్పెషల్ పోస్ట్ చేసింది. తన బావతో కలిసి ఫన్నీ మూడ్‌లో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ, “Happy Birthday Bava ❤️ love you Bava!” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
మెగా ఫ్యాన్స్ మాత్రం నిహారిక ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. “తన లైఫ్ తనది, తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి” అనే ఆత్మవిశ్వాసం ఆమెలో కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం నిహారిక, కొత్త సినిమాల ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండగా, ఈ బర్త్‌డే పోస్ట్ మాత్రం ఆమెకు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ టాక్ తెచ్చిపెట్టింది. నిహారిక – సాయి ధరమ్ తేజ్ బంధం ఎంత క్లోజ్‌గా ఉందో, ఆ ఫోటో చూసినవారికి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నిహారిక పోస్ట్ చేసిన ఆ పిక్చర్‌కి వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఒకవైపు మెగా ఫ్యాన్స్ హ్యాపీగా రియాక్ట్ అవుతుండగా, మరోవైపు నెటిజన్లు “నిహారిక స్టైల్ నిజంగా మామూలు కాదు!” అంటూ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.