ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముంది.. అసలు శ్రీలీల, ఆమె తల్లి పేరు ఎందుకు మీడియాలో వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండస్ట్రీలో డబ్బు కోసం ఎన్నో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు కొంతమంది.అయితే ప్రస్తుతం అలాంటి స్కాం ఒకటి జరుగుతుందని నెట్టింట వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఓ హీరోయిన్ తల్లి గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఆమె ఓ వైపు సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తోంది. అయితే ఆ హీరోయిన్ తల్లి చేసే చీప్ ట్రిక్స్ గురించి తాజాగా ఓ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్  బయట పెట్టారు. ఆయన తన ఇంస్టాగ్రామ్ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు.. టాలీవుడ్ లో స్టార్డం అందుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. అయితే ఈ హీరోయిన్ తల్లి ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతల దగ్గర కొత్తరకం మోసానికి తెరదీసింది.

ఆమె కుటుంబ సభ్యులు చాలా చీప్ గా ఆలోచిస్తూ నన్ను వేధిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఉండే టీంలు తక్కువ రేటుకే మేకప్ చేస్తున్నాయి. మీరు కూడా తక్కువ రేటుకే మేకప్ వేయాలి అని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఇష్టం లేకపోయినా కూడా ప్రతిసారి ఫోన్లు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా మీ టీం పేమెంట్లు తినడం ఆపండి.. లేకపోతే ఈసారి పేర్లతో సహా బయటపెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు ఇచ్చిన వార్నింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఈ విషయాన్ని, ఈ వీడియోని తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

అయితే బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న ఈమె తల్లి నిర్మాతలు నియమించే మేకప్ ఆర్టిస్ట్ లను కాకుండా వేరే మేకప్ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చి తన కూతురు సినిమాలకు వర్క్ చేయించుకొని వారికి తక్కువ పేమెంట్ ఇచ్చి పంపించేసి ఆ తర్వాత నిర్మాత దగ్గర డబుల్ పేమెంట్ తీసుకుంటూ కొత్త స్కామ్ చేస్తున్నట్టు తెలిపారు.అలా ఆ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ ఈ వ్యవహారంతో విసిగిపోయి నేరుగా సోషల్ మీడియాలో ఈ వీడియోని రిలీజ్ చేశారు.అయితే ఈ వీడియో బయటపడడంతో చాలామంది ఆ మేకప్ ఆర్టిస్ట్ చెప్పింది శ్రీలీల తల్లి గురించే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ మేకప్ ఆర్టిస్ట్  చేసిన కామెంట్స్ శ్రీలీల తల్లిని ఉద్దేశించినా.. నిజంగానే శ్రీలీల తల్లి డబ్బు కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందా.. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై శ్రీలీల తల్లి స్పందిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: