
విడుదలైన 11 రోజుల్లోనే ఈ ఓజీ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారు రూ. 308 కోట్ల గ్రాస్ వసూలు చేసి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. పవన్ మాస్ ఎనర్జీ, థమన్ అందించిన మ్యూజిక్, సుజీత్ స్టైలిష్ టేకింగ్ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ‘ ఓజీ ’ అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అంటే సినిమా విడుదలైన నాలుగు వారాలకే ప్రేక్షకులు ఇంట్లోనే పవన్ పవర్‌ను మళ్లీ ఆస్వాదించే అవకాశం లభించబోతోంది.
వెండితెరపై ఓజీ తెలుగులో క్రియేట్ చేసిన సెన్షేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ఇతర భాషల్లో మంచి ఆదరణ పొందుతుందేమో చూడాలి. థియేటర్లలో కాస్త మిస్సైన మార్కెట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రికవర్ అవుతుందన్న నమ్మకం ఫిల్మ్ యూనిట్‌లో ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ‘ఓజీ’ని మరోసారి ట్రెండింగ్‌లో నిలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.