టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి నాగార్జున ఈ మధ్య కాలంలో చాలా సినిమాలలో హీరో పాత్రలలో కాకుండా కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో , విలన్ పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం నాగార్జున హిందీ మూవీ అయినటువంటి బ్రహ్మాస్త్ర మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. అలాగే తెలుగు సినిమా అయినటువంటి కుబేర లో కీలకమైన పాత్రలో నటించాడు. తమిళ సినిమా అయినటువంటి కూలీ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇలా నాగార్జున రీసెంట్ టైం లో సినిమాల్లో హీరోగా నటించిన కంటే కూడా ఇతర హీరోల సినిమాల్లో నటిస్తూ కొత్త ట్రెండ్ తో ముందుకు సాగుతున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ కూడా ఇదే రూట్ లో పయనిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి "మన శంకర వర ప్రసాద్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే మరి కొంత కాలం లోనే నాగర్జున 100 వ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ లో ఒక పవర్ఫుల్ సీఎం పాత్ర ఉన్నట్లు , అందులో ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడు నటిస్తే బాగుంటుంది అని ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు , అందులో భాగంగా ఆ పాత్ర కోసం చిరంజీవి ని మేకర్స్ సంప్రదించగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా టాలీవుడ్ సీనియర్ హీరోలు అయినటువంటి నాగార్జున , వెంకటేష్ , చిరంజీవి ముగ్గురు కూడా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలలో నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: