టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు రేపాయి. ప్రేక్షకుల్లో ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు హామీ ఇచ్చే రవితేజ ఈసారి కూడా తన మాస్ అవతారంతో మరోసారి అలరించబోతున్నాడన్న కాన్ఫిడెన్స్ అంద‌రిలోనూ ఉంది. ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టాక్‌. ఇటీవల హీరో రవితేజ, నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై ఆసక్తికర అంశాలను వెల్లడించారు. “మాస్ జాతర కేవలం మాస్ ప్రేక్షకులకే కాదు, అందరికీ నచ్చే ఎంటర్‌టైనర్. ఫుల్ ఎనర్జీతో, పాజిటివ్ వైబ్స్‌తో సినిమా తీశాం” అని రవితేజ అన్నారు.


నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ “ సినిమా రిలీజ్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. ప్రీమియర్స్ కూడా అనుకున్న సమయానికే జరుగుతాయి ” అని స్పష్టం చేశారు. దీంతో మాస్ జాతర ప్రీమియర్స్ ఖాయమయ్యాయి. ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా మారింది. యూత్‌లో ఆ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఫైన‌ల్ గా టాలీవుడ్‌లో ఈ దసరాదీపావళి సీజన్‌కు ముగింపు పలుకుతున్న “ మాస్ జాతర ” సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రవితేజ మాస్ ఎనర్జీ మరోసారి థియేటర్లలో అలజడి రేపేలా కనిపిస్తోంది. ధ‌మ‌కా సినిమాలో ర‌వితేజ - శ్రీలీల మ్యాజిక్ ఎలా వ‌ర్క‌వుట్ అయ్యిందో మ‌రోసారి ఈ సినిమా తోనూ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నాల‌తో ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ? మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: