ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం వ్యవహారంలో తమిళనాడు అధికార పార్టీ నాయకుల పాత్ర కూడా ఉందా..? అంటే అవుననే వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. 2024లో తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు తమిళనాడు అధికార పార్టీని దుమ్మెత్తి పోసాయి. ఇక చర్యలు తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదు అనే విమర్శలు సైతం వినిపించాయి. అయితే ఇప్పుడు తమిళనాడు కల్తీ మద్యం వ్యవహారానికి.. ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యానికి లింకు ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 


2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల్లో.. ఈ కల్తీ మద్యాన్ని పెద్ద ఎత్తున విక్రయించారు అనే ఆరోపణలు వినిపించాయి. ఇక తాజాగా బయటపడిన కల్తీ మద్యం వ్యవహారంలో కూడా వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అప్పట్లో కల్తీ మద్యాన్ని తయారు చేశారు. రాయలసీమ ప్రాంతంలో తయారుచేసిన కల్తి మద్యాన్ని తమిళనాడులో విక్రయించినట్లు తెలుస్తోంది. 


అక్కడ అధికార పార్టీ నేతలతో కలిసి వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడి అధికార పార్టీ నేతలు మద్యం దందా కొనసాగించినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలకు చెందిన కొందరు కీలక నాయకులు ఇందులో అత్యంత కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. తాజాగా మదనపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారీ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.


ఇక అక్కడి నుంచి లింకులు లాగగా.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ జరుగుతుందని గుర్తించిన పోలీసులు.. అక్కడ కూడా సోదాలు జరపగా అక్కడ కూడా పెద్ద ఎత్తున కల్తీ మద్యం దొరికింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో తయారుచేసిన కల్తీ మధ్యాన్ని తమిళనాడులో కూడా విక్రయించారు అనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన కల్తీ మద్యం.. విక్రయించినట్లు గుర్తించారు. అదే తరహాలో తమిళనాడుకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తయారుచేసిన కల్తీ మద్యాన్ని తరలించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: