నందమూరి నటసింహ బాలయ్య సినిమాలు అంటే కచ్చితంగా డైలాగులు పవర్ ఫుల్ గా ఉండాలి. బాలయ్య నోటి నుంచి అదిరిపోయే మాస్ డైలాగులు వస్తే ఆయన అభిమానులకు ఆ కిక్కు వేరుగా ఉంటుంది. వాటికో ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఇక బాలయ్యతో బోయపాటి శ్రీను జతకడితే తెలుగు సినిమా అభిమానులకు వెరీ వెరీ స్పెషల్. బాలయ్య లైఫ్ కు కెరీర్ కు ... రాజకీయాలకు ముడిపెడుతూ డైలాగులు రాయించుకోవడం దర్శకుడు బోయపాటి శ్రీనుకు స్పెషల్. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పటికే సింహా - లెజెండ్ - అఖండ మూడు సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా బాలయ్య - బోయపాటి లేటెస్ట్ కాంబినేషన్ అఖండ 2 - తాండవం డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఏకే ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. గతంలో ఈ సినిమా నుంచి సీనియర్ బాలయ్య పాత్ర పరిచయం చేస్తూ టీజర్ వదిలారు. ఇప్పుడు అదే సినిమాలోని యంగ్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ మరో టీజర్ వదిలారు.
ఏ సౌండ్ కు నవ్వుతానో ... ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలియదు .. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో నా కొడకా అన్నది ఈసారి టీజర్ లో డైలాగు. అయితే ఇప్పుడు ఈ డైలాగు నిజజీవితంలో బాలయ్య మూడ్ స్వింగ్ కు సరిగ్గా సరిపోతుంది అన్న చర్చలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బాలయ్య ది భోళా మనస్తత్వం. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీటికి మాటికి ఆయన మీద పడితే ఆయనకు పరమ చిరాకు. కొంచెం డిస్టెన్స్ మైంటైన్ చేయాలి అంటూ ఉంటారు. ఇది రిలేట్ అయ్యేలా బోయపాటి డైలాగు రాయించి ఉంటారని అంటున్నారు.
ఇక మిగిలిన టీజర్ అంతా పరమ రొటీన్ గానే ఉంది. బోయపాటి స్టైల్ లో ఉంది. పదిమంది రౌడీలను చేతులతో తోయటం.. రౌడీలు పడిపోవటం ఇవన్నీ గతంలో బాలయ్య - బోయపాటి సినిమాలలో చూసిన షాట్లే. బాలయ్య బెదిరిస్తూ డైలాగు చెప్పే ప్రేమ్ కూడా రెగ్యులర్ గానే ఉంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఏది ఏమైనా ఈ టీజర్ తో ఇది బాలయ్య - బోయపాటి సినిమా అన్నట్టుగానే ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అఖండ 2 తాండవం వీక్షించేందుకు డిసెంబర్ 5 వరకు వెయిట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి