మెగా మేనల్లుడుగా పేరు సంపాదించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలుగా పేరు సంపాదించిన నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ రోహిత్ కేపీ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూ.125 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కంటెంట్ చూస్తే ఏదో భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తున్న తీరు కూడా చాలా విభిన్నంగా కనిపిస్తోంది.

దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావొచ్చిందనే విధంగా వినిపించాయి. ఇంకా రెండు షెడ్యూల్స్ పూర్తి చేస్తే సినిమా పూర్తి అవుతుందని వినిపించిన తరుణంలో ఏమైందో తెలియదు కానీ సాయి ధరమ్ తేజ్  నిన్నటి రోజున రిపబ్లిక్ 2 సినిమా చేయబోతున్నారనే విధంగా వార్తలు తెరమీదకి వచ్చాయి. ఈ విషయంతో సంబరాలు ఏటిగట్టు ఆగిపోయిందనే విధంగా రూమర్స్ మొదలయ్యాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా ఈ విషయం పైన తేజ్ టీమ్  తెలుపుతూ అందులో నిజం లేదంటే తేల్చి చెప్పేసింది.


ప్రస్తుతానికి తేజ్ సినిమా ఫోకస్ అంతా కూడా సంబరాల ఏటిగట్టు సినిమా మీదే ఉందంటూ తెలియజేశారు. పాన్ ఇండియా లెవల్ రూ .125 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మీదే ఫోకస్ మొత్తం పెట్టారు. తేజ్ ఈ సినిమా పూర్తి అయ్యేవరకు మరే సినిమాని కూడా ఫైనల్ చేసి అవకాశం లేదంటే టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి విషయాలైనా సరే తమ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందని తెలియజేశారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ తదితర నటీనటులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: