జైలర్ 2లో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ కీలక కేమియో పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు కొంతకాలంగా వైరల్ అయ్యాయి. రజనీకాంత్ - బాలయ్య స్క్రీన్ షేరింగ్ ఆలోచన అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. కానీ తాజాగా వచ్చిన సమాచారం మాత్రం అభిమానులను నిరాశపరిచేలా ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’లో కేమియో పాత్ర ఆఫర్ చేసినా, బాలయ్య ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య ఈ పాత్ర ఎందుకు రిజెక్ట్ చేశారు అన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.
ఆ పాత్రకు స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటమే కారణమని అంటుంటే, మరికొందరు బాలయ్య తన సొంత ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టినందున సమయం కేటాయించలేకపోయారని అంటున్నారు. అయితే బాలయ్య ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకున్నాడన్నదే ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక బాలయ్య స్థానంలో ఆ పాత్రకు మరో స్టార్‌ను సంప్రదిస్తున్నారని సమాచారం. ఎవరు ఆ పాత్రలో నటిస్తారో తెలుసుకోవడానికి మాత్రం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా, ‘జైలర్ 2’ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం దక్షిణాది ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి