టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోలలో సుధీర్ బాబు ముందువరసలో ఉంటారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా మెయిన్ రోల్స్ లో తెరకెక్కిన జటాధర మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్షన్ లో తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఘోస్ట్ హంటర్ గా పని చేసే శివకు (సుధీర్ బాబు)  దెయ్యాలంటే అస్సలు నమ్మకం ఉండదు.  అయితే ఘోస్ట్ హంటర్ గా పని చేయడం ద్వారా దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని శివ ప్రయత్నిస్తూ ఉంటాడు.  అయితే శివకు కలలో ఎవరో చిన్నపిల్లాడిని చంపుతున్నట్టు పదే  పదే  ఒక కల వస్తుంది.  రుద్రారం గ్రామానికి చెందిన శివకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా  ఒక ధన పిశాచి ఆ వ్యక్తిని చంపిందని  ఆ ధన పిశాచి లంకె బిందెలకు కాపలాగా ఉందని శివకు తెలుస్తుంది.

లంకె బిందెల కోసం శివ వెళ్లగా ఆ తర్వాత అతని జీవితంలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి.  అతని కుటుంబ సభ్యులకు కూడా ఊహించని ప్రమాదం జరగగా వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. అదే సమయంలో కలలో కనిపించే ఫోటో శివకు తారసపడుతుంది. ఆ ఫోటోలో ఉన్న చిన్నపిల్లాడు ఎవరు?  ధన పిశాచి కథ నిజమేనా?  లంకె బిందెలకు సంబంధించి వాస్తవాలేంటి ? అనే ప్రశ్నలకు  జవాబే ఈ సినిమా.

విశ్లేషణ:

ఈ మధ్య కాలంలో డివోషనల్  టచ్ తో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నాయి. జటాధర  సినిమా కూడా  ఆ కోవలోకే వస్తుంది.  సినిమాలో పెద్దగా సాగదీత లేకుండా సూటిగా స్క్రీన్ ప్లేను చెప్పే ప్రయత్నం చేశారు  ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు  ఆసక్తికరంగా ఉన్నాయి.  ఎమోషనల్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం సినిమాకు ప్లస్ అయింది.

 శివ పాత్రలో సుధీర్ బాబు అద్భుతంగా నటించగా ధన పిశాచి పాత్రకు  సోనాక్షి సిన్హా ప్రాణం పోశారు.  చివర్లో శివుడు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్  తెప్పిస్తాయి.  ఈ సినిమాకు సెకండ్ పార్ట్  కూడా ఉండటం కొసమెరుపు. ఈ వీకెండ్ కు విడుదలైన సినిమాల్లో జటాధర  బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.  ఈ సినిమా సక్సెస్ తో సుధీర్ బాబుకు బాలీవుడ్ లో సైతం ఆఫర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సోనాక్షి సిన్హా బెస్ట్ అనిపించుకున్నారు.

రాజీవ్ కనకాల, ఝాన్సీ, రవి ప్రకాష్, నవీన్ నేని, అవసరాల శ్రీనివాస్ తమ పాత్రలకు న్యాయం చేశారు.  శిల్పా  శిరోద్కర్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

టెక్నీకల్ గా కూడా ఈ సినిమా టాప్ రేంజ్ లో ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సాంగ్స్, మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది.  నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.  కొన్ని సన్నివేశాలు రొటీన్ అనిపించినా జటాధర మూవీ పైసా వసూల్ మూవీ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటన, స్క్రీన్ ప్లే, కొన్ని ట్విస్టులు

మైనస్ పాయింట్స్ : కొన్ని రొటీన్ సన్నివేశాలు

రేటింగ్ : 2.75/ 5.0

మరింత సమాచారం తెలుసుకోండి: