టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో రామ్ పోతినేని ఒకరు. రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఉపేంద్రమూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను నవంబర్ 28 వ తేదీన థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సినిమాను ఎంత బాగా తీశామో అనే దాని కంటే కూడా సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేసాము అనేదే ముఖ్యం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకు అంటే సినిమాను ఎంత బాగా తీసిన దానిని సరిగ్గా ప్రమోట్ చేయనట్లయితే మూవీ బాగున్న దానికి కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దానితో ఈ మధ్య కాలంలో ఒక సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత హడా విడిగా దానిని విడుదల చేయకుండా ప్రమోషన్లకు కూడా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఇక ఇదే రూట్ లో ప్రస్తుతం రామ్ పోతినేని కూడా వెళుతున్నాడు. తాజాగా ఈయన నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్లను ఈయన అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తున్నాడు. 

సినిమా విడుదలకు చాలా రోజుల ముందు నుండే ఈయన వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు. ఈ మూవీ లోని నాలుగవ సాంగ్ అయినటువంటి ఫస్ట్ డే ఫస్ట్ షో సాంగ్ ను నవంబర్ 12 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విమల్ 70 ఏం ఏం బెంగళూరు మరియు హైదరాబాద్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూడు బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా రామ్ "ఆంధ్ర కింగ్ తాలూకా" ప్రమోషన్లను అద్భుతమైన స్థాయిలో నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: