SSMB 29 సినిమాలో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను పరిచయం చేస్తూ రాజమౌళి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా చీర ధరించి చేతిలో గన్ను పట్టుకొని మరీ చాలా అగ్రేసివ్ గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో నటిస్తున్నట్లు రాజమౌళి తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో మాత్రం ప్రియాంక చోప్రా అందరిని ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది.ఇందుకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతోంది.
ఇక మహేష్ బాబు లుక్ కోసమే అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సుమారుగా రూ .1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమౌళి కూడా ఈ సినిమా పైన వరుస అప్డేట్లు ఇస్తూ ఇప్పటినుంచి ప్రమోషన్స్ ని మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. SSMB 29 సినిమా టైటిల్ కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు. గత కొద్దిరోజులుగా వారణాసి అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి