చాలా సంవత్సరాల క్రితం జేమ్స్ కామరన్ "అవతార్" అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు భాషలో కూడా అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అవతార్ సినిమా వచ్చాక ఆ మూవీ కి కొనసాగింపగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే సినిమాలు జేమ్స్ కేమారన్ రూపొందించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితమే విడుదల అయింది. ఈ సినిమాను కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ సినిమాను కూడా తెలుగు భాషలో విడుదల చేశారు. ఇకపోతే అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగు భాషలో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

తాజాగా జామ్స్ కామరన్ అవతార్ ఫైర్ అండ్ అష్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 19 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రన్ టైం ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 3 గంటల 15 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అవతార్ మరియు అవతార్ ది ఆఫ్ వాటర్ సినిమాలు కూడా భారీ రన్ టైం తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక అవతార్ ఫైర్ అండ్ అష్ మూవీ కూడా అదే రేంజ్ లో భారీ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: