మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న SSMB 29 సినిమా టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీ లో గ్లోబ్ ట్రోటర్ అంటూ గ్రాండ్ ఈవెంట్ ప్రస్తుతం జరుగుతోంది.  ఈవెంట్లో మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించి టైటిల్ ను  కూడా వారణాసి అంటూ అధికారికంగా ప్రకటించేశారు. అంతేకాదు ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో టైటిల్  గ్లింప్స్ కూడా విడుదల చేయగా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.


మహేష్ బాబు లుక్ అయితే అభిమానులను మరింత ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వారణాసి చిత్రములో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు.ఈ రుద్ర పేరు శివుడిని సూచిస్తుంది. ఎలాంటి సమస్యలనైనా సరే ఎదురుగా నిలబడి ఎదుర్కొనే వీరుడుగా మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక ప్రియాంక చోప్రా కూడా ఇందులో మందాకిని పాత్రలో కనిపించబోతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించబోతున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి మరికొంతమంది నటీనటులు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఈవెంట్ గురించి సందడి కనిపిస్తోంది. వందలాదిమంది మహేష్ బాబు అభిమానులు చేరుకొని మరీ ఈ ఈవెంట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు ఎద్దు పై స్వారీ చేస్తూ.. నందిపై శివుడులా వస్తున్న తీరు అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సుమారుగా రూ .1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న గ్లోబ్ ట్రోటర్  ఈవెంట్ కి మహేష్ బాబు , ప్రియాంక చోప్రా వచ్చిన తీరు చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో లు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: