మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన అప్డేట్ నిన్నటి రోజున రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేకంగా ఈవెంట్లో టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు మహేష్ బాబు లుక్ కి సంబంధించి చిన్న గ్లింప్స్ విడుదల చేయగా అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఎంట్రీ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా కనిపించాయి. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా కథనం రామాయణంలో ఒక భాగంగా తీసుకున్నానని రాజమౌళి తెలిపారు.



మహేష్ బాబు ఈవెంట్ లో మాట్లాడుతూ ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ తెలియజేశారు. చాలా రోజుల తర్వాత తాను బయటికి వచ్చాను, కొంత కొత్తగా ఉందని కానీ చాలా బాగుంది అంటూ తెలిపారు. స్టేజ్ మీదకి ఎప్పటిలాగే సింపుల్గా నడిచి వస్తా సార్ అంటే రాజమౌళి ఒప్పుకోలేదు.. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో అంటూ తెలియజేశారు. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా సరదాగా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన తండ్రి గురించి చెప్పిన మాటలు అందరిని ఎమోషనల్ గా ఆకట్టుకున్నాయి.

నాకు నాన్నగారు అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే..ఆయన చెప్పిన మాటలు అన్ని వినేవాడిని కానీ ఎప్పుడూ కూడా ఒక పౌరాణిక సినిమా చేయాలని చెప్పేవారు. ఆ విషయాన్ని ఎప్పుడూ వినలేదు.. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తోడుంటాయి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, తన తండ్రి కల కూడా ఈ సినిమాతో నెరవేర్చడానికి తాను ఎంత కష్టపడాలో అంత కష్టపడతా ఈ సినిమా విడుదలైన తర్వాత ద హోల్ ఆఫ్ ఇండియా ప్రౌడ్ ఆఫ్ హౌస్ అని అంటారని తెలిపారు మహేష్ బాబు. ఇది కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ముందు ముందు అప్డేట్స్ ఎలా ఉంటాయో మీ ఊహాలకే వదిలేస్తున్నానంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: