సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలి అంటే అందం అనేది చాలా ముఖ్యం. అందం మాత్రమే ఉంటే అవకాశాలు వరుస పెట్టి వస్తాయేమో కానీ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరాలి అన్న , అనేక సంవత్సరాలు అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగించాలి అన్న అందంతో పాటు నటన , విజయాలు కూడా ఎంతో కీలకం. అందం , నటన , విజయాలు ఈ మూడు ఉన్న బ్యూటీలకు వరుస అవకాశాలు , స్టార్ హీరోయిన్స్ స్టేటస్ దక్కుతూ ఉంటుంది. ఇకపోతే కెరియర్ స్టార్టింగ్ లోనే తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని అద్భుతమైన రీతిలో దూసుకుపోయిన ముద్దుగుమ్మలలో కొంత మంది ప్రస్తుతం మాత్రం చాలా కష్ట కాలంలో ఉన్నారు.

అందులో కృతి శెట్టి మొదటి వరుసలో ఉంది. ఈమె ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ అనేక సినిమాలలో నటించింది. అందులో అనేక మూవీలతో అపజయాలను అందుకుంది. దానితో ప్రస్తుతం ఈమెకు తెలుగులో అవకాశాలే లేకుండా పోయాయి. ఇక శ్రీలీల "పెళ్లి సందD" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత ఈమె చిన్న , మీడియం , స్టార్ హీరోలతో నటించింది. కానీ ఈమెకు విజయాల శాతం మాత్రం అత్యంత తక్కువ. దానితో ప్రస్తుతం ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. దానితో ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ్ , హిందీ సినిమాలపై ఆసక్తిని చూపిస్తుంది. ఇక ఈ ఇద్దరి లిస్టులోకే భాగ్య శ్రీ బోర్స్ కూడా చేరేలా కనబడుతుంది. భాగ్య శ్రీ బోర్స్ "మిస్టర్ బచ్చన్" అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ ఇందులో ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈమెకు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

కొంత కాలం క్రితం అనే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. తాజాగా కాంత మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా అపజయం అందుకునేలా ఉంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించనట్లయితే భాగ్య శ్రీ కెరియర్ కూడా డేంజర్ లోనే పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: