- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో సంగీత మాంత్రికుడు ఎం.ఎం. కీరవాణి చేసిన ప్రసంగం అభిమానులకు నిజంగా పండుగలా అనిపించింది. ఆయన చెప్పిన ప్రతి మాటలో భావం, హాస్యం, అభిమానపూర్వక ప్రేమ కలిసి ఒక ప్రత్యేక శైలిని సృష్టించాయి. ముఖ్యంగా మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌పై ఆయన చూపిన ఎమోషన్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది. కీర‌వాణి త‌న స్పీచ్‌లో “ స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆస్కార్ స్టేజ్ వరకు నా తమ్ముడు రాజమౌళితో కలిసి చేసిన ప్రయాణం ఎంతో విశేషమైంది. ఆ ప్రయాణంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు, ఆనందాలు చూశాం. ట్రిపుల్ ఆర్‌ తో గ్లోబ్ మరో వైపు వెళ్లాం. కానీ గ్లోబ్ అంటే కేవలం అమెరికా కాదు… అనేక ఖండాలు, అనేక సంస్కృతులు, ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. వాటినంతటినీ ఆవిష్కరించడానికి రాజమౌళి - మహేష్ బాబు కాంబో ‘వారణాసి’తో ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయాణం నాకు కూడా భలే ఎక్సైటింగ్‌గా ఉంది ” అంటూ చెప్పిన కీరవాణి, మహేష్ బాబు అభిమానుల్లో ట‌న్నుల కొద్దీ హుషారుని నింపేశారు.


అదే ఉత్సాహంతో సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తుచేసుకుంటూ “ మోసగాళ్లకు మోసగాళ్లు చూసి ఆయనకు అభిమానిగా మారాను. వారి వారసుడు మహేష్ బాబు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ప్రత్యేకంగా ‘ పోకిరి ’ సినిమా… ఆ పవర్ ఫుల్ డైలాగ్స్ , మిత్రుడు మణిశర్మ మ్యూజిక్ కోసం ఎన్ని సార్లు చూశానో నాకు కూడా గుర్తులేదు. అది నా ఫేవరెట్ సినిమా ” అని చెప్పడం తో హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఇక్కడే అసలు కీరవాణి మేజిక్ మొదలైంది. పోకిరి ఐకానిక్ డైలాగ్‌ని తన స్టైల్‌లో మిక్స్ చేస్తూ స్పీచ్ ఇచ్చారు.


“ నేను మెలోడీ బాగా కొడతాను … బీట్ సరిగ్గా ఇవ్వలేనని పేరు వచ్చింది. ఎందుకువచ్చిందో తెలీదు. కానీ ఇప్పుడు కొత్తగా ఫ్లాట్ కొన్నాను. అది సిమెంట్‌తో కట్టింది కాదు… మహేష్ బాబు ఫ్యాన్స్ మీ గుండెల్లో ఫ్లాట్ కొన్నాను .. ప్రొడ్యూసర్ హ్యాపీ … బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేశారు… టైల్స్ వేస్తున్నారు. బీట్ నాదే, మెలోడీ నాదే… 2027 సమ్మర్‌కు గృహప్రవేశం ” ఈ లైన్స్ విన్న వెంటనే మహేష్ అభిమానులు హౌస్‌ఫుల్ థియేటర్ లా ఉప్పొంగి పోయారు. కీరవాణి స్పీచ్ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: