నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే బాలకృష్ణ ఈ మధ్య కాలంలో తనకు విజయాలు ఇచ్చిన దర్శకులతో పని చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు. అందులో భాగంగా తనకు ఇప్పటికే వీర సింహా రెడ్డి మూవీ తో మంచి విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. గత కొంత కాలంగా ఈ సినిమాలో ఆ ముద్దుగుమ్మ హీరోయిన్గా కనిపించబోతుంది ..? ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కనిపించబోతుంది ..? అని అనేక వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా నయనతార కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బాలకృష్ణ , నయనతార కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి. మొదటగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో జై సింహ అనే సినిమా వచ్చింది.

సినిమా కూడా మంచి విజయం అందుకుంది. వీరి కాంబోలో రాబోయే మూడవ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు. బాలకృష్ణ ఒక వైపు తనకు అద్భుతమైన విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉండడం , ఆ మూవీ లో ఇప్పటికే తనకు రెండు విజయాలను అందించిన నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండడంతో బాలకృష్ణ హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: