గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోల నుంచి మొదలు పెడితే లేటెస్ట్ హీరోల వరకు ఎంతో మంది నటించిన సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో కొత్త కొత్త రికార్డులను కూడా సృష్టించాయి. సీనియర్ స్టార్ హీరోల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలను రీ రిలీజ్ చేశాయి.

తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన శివ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇంద్ర సినిమా రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లను వసూలు చేయగా ఆ కలెక్షన్లను శివ సినిమా రీ రిలీస్ లో భాగంగా క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా శివ మూవీ రీ రిలీజ్ లో భాగంగా చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ రీ రిలీజ్ కలెక్షన్లను దాటివేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇది ఇలా ఉంటే చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం కొదమ సింహం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాను నవంబర్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. దానితో కొంత మంది శివ సినిమా తాజాగా మంచి కలెక్షన్లను రీ రిలీజ్ లో వసూలు చేసి సీనియర్ స్టార్ హీరోల మూవీలలో హైయెస్ట్ కలెక్షన్లలో రీ రిలీజ్ లో భాగంగా వసూలు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. మరి చిరంజీవి "కొదమ సింహం" మూవీ తో శివ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లను క్రాస్ చేసి సరి కొత్త రికార్డును సృష్టిస్తుంది అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి శివ సినిమా కలెక్షన్లను కొదమ సింహం మూవీ దాటేస్తుందో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: