పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు చేస్తూ, మరో వైపు రాజకీయాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఆయన నటించిన "ఉస్తాత్ భగత్ సింగ్" సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా హోల్డ్‌లో ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి హై-బజ్ టైమ్‌లోనే పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ నయనతార అని అప్పట్లో ప్రచారం జరిగింది. సినిమా టీమ్‌లోనుంచి వచ్చిన సమాచారం ప్రకారం, "వకిల్ సాబ్ " సినిమాలో శృతి హాసన్ పోషించిన పాత్ర కోసం తొలుత నయనతారను అప్రోచ్ అయ్యారట. అయితే చిన్న స్క్రీన్ టైమ్ ఉన్న క్యారెక్టర్లలో నటించేందుకు ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదని, రెమ్యూనరేషన్ వివరాలు కూడా అడగకుండా వెంటనే ప్రాజెక్ట్‌ను తిరస్కరించిందని వార్తలు వచ్చాయి.
ఎప్పుడూ టాప్ రేంజ్‌లో ఉండే నయనతార ఇలాంటి పాత్రలో నటించడానికి సిద్ధం కాకపోవడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కొంత అసహనం కలిగించిందనేది అప్పటి పరిస్థితి. దీనితో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా జరిగింది.అయితే ప్రస్తుతం మళ్లీ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న నయనతార, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అయినప్పటికీ కొంతమంది నెటిజన్లు పాత విషయాల్ని మళ్లీ లాగి వచ్చి ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై అభిమానులకు, సినీ వర్గాలకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి