సినిమా ఇండస్ట్రీ లో దాదాపుగా హీరోల తర్వాత ఆ స్థాయి పారితోషకాలను దర్శకులు పుచ్చుకుంటూ ఉంటారు. కానీ దర్శకులకు హీరోలా స్థాయి పారితోషకాలు పుచ్చుకోవాలి అంటే వారి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండాలి. వారి దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , అలాగే వారు దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసినట్లయితే వారికి హీరోల స్థాయి పారితోషకాలు ముడుతూ ఉంటాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల రేంజ్ కి ఏ మాత్రం తీసుకొని క్రేజ్ ఉన్న దర్శకులలో రాజమౌళి ఒకరు. రాజమౌళి ఎవరితో సినిమా చేసిన ఆ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి.

ఇలా రాజమౌళి కి అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఆయన కి అదే రీతిలో పారితోషకాలను కూడా నిర్మాతలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి ఒక్కో సినిమాకు ఏకంగా 200 కోట్ల వరకు అడ్వాన్స్ గానే తీసుకోనున్నట్లు , ఇక సినిమా విడుదల అయిన తర్వాత లాభాలలో 30 శాతం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాజమౌళి కి ఈ స్థాయి పారితోషకాలు ఇస్తూ ఉండడంతో చాలా మంది రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహించాడు అంటే చాలు ఆ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆయన సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను ఇప్పటివరకు వసూలు చేయడంతో ఆయన మూవీ ద్వారా నిర్మాతకు ఏ మాత్రం నష్టం ఉండదు. అందుకే ఆయనకు ఆ స్థాయి పారితోషకమును  నిర్మాతలు ఇస్తున్నారు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.   ఎస్ ఎస్ రాజమౌళి  ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న వారణాసి అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: