సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ అంత కాలం ఉండదు అనేది అనేక మంది హీరోయిన్ల విషయంలో ప్రూ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం స్టార్ హీరోల రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. కొంత మంది నటీ మణులు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో హీరోయిన్లుగా నటించి అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ల రేంజ్ కి వెళ్లి అలాగే అనేక సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ ఈమేజ్ లేకపోయిన వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అనేక సంవత్సరాల పాటు కెరియర్ను సూపర్ జోష్ లో ముందుకు సాగిస్తూ ఉంటారు. అలాంటి బ్యూటీలలో తమన్నా ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె నటిగా కెరియర్ ను మొదలు పెట్టిన కొంత కాలానికే అనేక విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అలాగే అనేక సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు సాగించింది. ఈమెకు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ ఈమేజ్ లేకపోయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇప్పటికి కూడా తమన్నా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

ఈమె సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లలో కూడా నటించి తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో తమన్నా కు తెలుగు లో అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందబోయే సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ వార్త నిజం అయ్యి , ఈ మూవీ విజయం సాధించి , ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కి మంచి క్రేజ్ వస్తే మళ్ళీ తమన్నా కి తెలుగు లో మంచి అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: