టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ మూవీ టైటిల్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపుతున్నాయి.ఇప్పటికే అట్లీ, టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎస్.ఎస్. రాజమౌళి శైలిలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్‌ను రీవీల్ చేయాలన్న ఆలోచన అట్లీ టీమ్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయట.
తాజా రూమర్స్ ప్రకారం, ఈ గ్రాండ్ ఈవెంట్‌ను మూవీ హీరోయిన్ దీపికా పదుకోనే పుట్టినరోజు అయిన జనవరి 5న లేదా అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బర్త్‌డే అయిన జనవరి 10న నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దీంతో “నాన్న సెంటిమెంట్‌తో సినిమాకి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నావా అట్లీ?” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.అట్లీ ప్లాన్ చేసినట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే, ఆయన పాన్-ఇండియా స్థాయిలో టాప్ డైరెక్టర్ల జాబితాలో మరొకసారి తన స్థానం పక్కాగా నిలబెట్టుకునే అవకాశం ఉంది. ‘జవాన్’తో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి మరొక హై-వోల్టేజ్ మాస్-పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ఇవ్వబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
ఇప్పటికే సినిమా సెట్‌పై నుండి వస్తున్న చిన్న చిన్న అప్‌డేట్స్, లీక్స్ చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అల్లు అర్జున్ లుక్, యాక్షన్ సీక్వెన్సులు, అట్లీ టేకింగ్— ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పుడు చూడాల్సిందల్లా—ఈ మాసివ్ కాంబినేషన్ నుంచి ఎలాంటి టైటిల్ రానుంది? ఈ ప్రాజెక్ట్ అట్లీ కెరీర్‌ను ఇంకా ఎలాంటి మలుపు తిప్పబోతోంది? అన్నదే. త్వరలోనే దానికి ఆన్సర్ దొరికేస్తుంది..!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి