గత కొద్ది రోజుల నుంచి ఐ బొమ్మ రవి పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అయితే రవి కేసులో రోజుకొక ట్విస్ట్ కనిపిస్తోంది. రవి సినిమాలను పైరసీ చేయలేదని.. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ ఎంవి వంటి పైరసీ ద్వారా సినిమాలను కొన్న తర్వాతే వాటిని ఐబొమ్మ, బప్పం వంటి వాటిలో అప్లోడ్ చేస్తున్నారంటూ తాజాగా పోలీసులు తెలియజేసినట్లు సమాచారం. తాజాగా విచారణలో భాగంగా మెయిల్ ఐడితో ఎన్జీలా కంపెనీల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సినిమాలను పైరసీలు కొని వాటిని లో క్వాలిటీ హెచ్డి గా మార్చి తన ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు.

ఇక ఐ బొమ్మ అని పోస్టర్ను రవి స్నేహితుడైన నిఖిల్ డిజైన్ చేసేవారట. ఐ బొమ్మ సైట్లో పోస్టర్లు , సినిమాలు చూడాలనుకున్న, లేకపోతే డౌన్లోడ్ చేయాలనుకున్న  టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కూడా అంగీకరించాల్సి ఉంటుందట. ఇలా అంగీకరించిన వెంటనే మొదట బెట్టింగ్, గేమింగ్ యాప్స్ లింకులు ఓపెన్ అవుతాయి.అలా అన్ని యాడ్స్ అయిపోయిన తర్వాతే ఐ బొమ్మలో సినిమా వినియోగదారులు చూడాల్సింది. అలా ఎంతమంది చూస్తే అంత మొత్తంలో రవికి డబ్బులు వస్తాయని పోలీసులు తెలియజేస్తున్నారు. రవి కూడా విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు రూ .20 కోట్ల రూపాయలు పైగా సంపాదించినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు.

అయితే కేవలం ఆయన ఖాతాలో రూ .3 కోట్ల రూపాయలు మాత్రమే ఉండడంతో అధికారులు ఆ డబ్బులు ఫ్రీజ్ చేశారు. వీటితో పాటుగా హైదరాబాదులో ఒక ఫ్లాట్ వైజాగ్ లో ఉండే ఆస్తులను కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన రూ .17 కోట్లు విదేశాలలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఐబొమ్మ లో పైరసీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో పాటుగా కాపీరైట్స్ ఉల్లంఘించి, మనీలాండరింగ్ వంటి కేసులలో కూడా రవి అరెస్టయ్యారు. ఐ బొమ్మ రవిని ఇంకా విచారిస్తున్నట్లు తెలుస్తోంది అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: