టాలీవుడ్లో మెగా బ్రదర్ గా పేరు సంపాదించిన నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమారుగా 100కు పైగా చిత్రాలలో నటించిన నాగబాబు కొన్ని చిత్రాలలో హీరోగా,తండ్రిగా, విలన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించారు. తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో కీలకమైన పాత్ర పోషించారు నాగబాబు. ప్రస్తుతం జనసేన పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నాగబాబు 2024 ఎన్నికలలో భాగంగా కూటమిగా జత కట్టారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన సభ్యుల కోటాలో నాగబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా విజయాన్ని అందుకున్నారు.


ఎమ్మెల్సీగా కూడా ప్రమాణస్వీకారం చేశారు నాగబాబు. ఇప్పుడు తాజాగా నాగబాబుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తన కుటుంబంతో కలిసి iffi గోవా 2025 ఈవెంట్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. నాగబాబు చాలా బక్క చిక్కిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగబాబు కొంతమేరకు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో లాగా ఫిట్ గా ఆయన కనిపించడం లేదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.



చాలావరకు నాగబాబు బరువు తగ్గినట్టుగా కనిపిస్తోంది. దీంతో నాగబాబుకి ఏదైనా అనారోగ్య సమస్యల? లేకపోతే స్లిమ్ గా కనిపించడానికి డైట్ పాటిస్తున్నారు? అనే విషయంపై ఇప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున చర్చించేలా చేస్తోంది. ఈవెంట్ కి మెగా బ్రదర్ నాగబాబు తో పాటుగా కూతురు నిహారికతో పాటు నాగబాబు భార్య కూడా పాల్గొన్నట్లు కనిపిస్తోంది. నాగబాబు ఆరోగ్య  విషయం పైన అటు మీద కుటుంబ సభ్యులు కాని ,నిహారిక గాని ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ఇటీవల కాలంలో నాగబాబు కార్యకర్తలకు కూడా కొంతమేరకు ఆర్థిక సహాయం కింద జనసేన పార్టీ నుంచి చెక్కులను కూడా అందించారు. ఇలా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలో ఇలాంటి వార్తలు వినిపించడం జనసేన కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: