హీరో రామ్ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. కథలోని భావోద్వేగాన్ని అందంగా తెరపై చూపించిన రామ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు భారీగా స్పందిస్తున్నారు. అదే సమయంలో, భాగ్యశ్రీ పాత్ర కూడా చాలా తాజాగా, సహజంగా డిజైన్ చేయబడింది. ఇంతకుముందు ఆమె చేసిన పాత్రల్లో ఎక్కువగా గ్లామర్‌కే ప్రాధాన్యత ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆమెను పూర్తిగా ఫ్యామిలీ గర్ల్ పాత్రలో, సింపుల్‌గా, నేచురల్‌గా చూపించారు.భాగ్యశ్రీ–రామ్ మధ్య ఎక్కడా ఇబ్బందికరమైన లేదా బోల్డ్ షాట్స్ లేవు. ఆమె పాత్రకు మంచి డెప్త్ ఇచ్చారు. డైలాగ్స్ నుంచీ ఎమోషనల్ సన్నివేశాల వరకు — భాగ్యశ్రీ తన నటనతో స్క్రీన్‌పై కొత్తగా మెరిసింది. ఇప్పటివరకు గ్లామర్ ప్రధానమైన పాత్రలు చేసిన ఆమెకు ఈసారి మాత్రం నటన ప్రదర్శించడానికి మంచి స్కోప్ లభించింది. ఆ అవకాశం పూర్తిగా ఉపయోగించుకున్నందుకు దర్శకుడితో పాటు ప్రేక్షకులూ ఆమెను ప్రశంసిస్తున్నారు.
సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో భాగ్యశ్రీపై అభిమానులు వరుసగా కామెంట్లు చేస్తున్నారు.“ఇన్నాళ్లూ గ్లామర్ కోసం చేసిన పాత్రలతో హిట్ రాలేదు… ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ తీసుకుని హిట్ కొట్టావ్ పాప!”,“నిజమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తే నీలో ఎంత టాలెంట్ ఉందో తెలుస్తోంది…”,“ఇలా కొనసాగితే నువ్వూ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఉంటావ్…”అంటూ ఆమెను ప్రశంసల వర్షంతో ముంచేస్తున్నారు. ఇది ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహమే లేదు.మొత్తం మీద ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం భాగ్యశ్రీకి ఎంతో కీలకమైన మైలురాయిగా మారింది. గ్లామర్ కంటే నటనతో హిట్ కొట్టినా ఎలా ఉంటుందో ఆమె చూపించి పెట్టింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి