- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మన దగ్గర డబ్బులున్నాయి .. ఒకరికి ఒక కోటి రూపాయలు ఇస్తే మనకి 100 కోట్లు మిగులుతాయి. అంటే అప్పుడు మనలో 99 % మంది ఏం చేస్తాం.. ఆ కోటి ఇచ్చేసి 100 కోట్లు మిగిలించుకుంటాం కదా.. ! కానీ మ‌న టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ .. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజమౌళి కి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం డాక్ట‌ర్ కేఎల్‌. నారాయణ ( దుర్గా ఆర్ట్స్ అధినేత ) సినిమా చేసి పెట్టమని అడ్వాన్స్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ లో అడ్వాన్స్ లు మామూలే. తర్వాత సినిమా చేయడం కుదరకపోతే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు రాజమౌళి కూడా నారాయణ కి 15 లక్షలకు వడ్డీతో కలిపి ఒక కోటి ఇస్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అలా చేస్తే రాజమౌళి కి కనీసం 100 కోట్లు మిగులుతాయి. కానీ రాజమౌళి డబ్బు కన్నా మాట కి విలువ ఇచ్చారు.


ఇప్పుడు ఆయనకి వారణాసి సినిమా చేస్తున్నారు. పైగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరో. అస‌లు మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబినేష‌న్ లో సినిమా కోసం టాలీవుడ్ జ‌నాలు ఏకంగా 15 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమా పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ లో తెర‌కెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ వ‌సూళ్లు ... మార్కెటింగ్ క‌నీసం రు. 5 వేల కోట్ల కు పైనే ఉంటుంద‌ని భార‌తీయ సినీ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. మ‌రీ రాజ‌మౌళి ఇదే ప్రాజెక్ట్ సొంతంగా చేసుకున్నా .. లేదా మ‌రో నిర్మాత‌కు చేసిపెట్టినా ఎంత మిగిల్చుకోవ‌చ్చో ఆలోచ‌న చేయండి. కానీ అలా చేయ‌కుండా ఎప్పుడో కొన్నేళ్ల క్రితం నారాయ‌ణ‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి సినిమా చేస్తున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా విష‌యం లో  ఇంతే, దానయ్య కి ఎప్పుడో ఇచ్చిన మాట కోసం సినిమా చేసారు. సినిమా కి ఫైనాన్స్ సమస్య వస్తే , రాజమౌళి షూరిటీ ఉండి డబ్బు అరేంజ్ చేసి సినిమా పూర్తి చేసారు. దానయ్య కి కనీసం 200 కోట్లు లాభం వచ్చింది. ఇదీ రాజమౌళి క్యారెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: