టాలీవుడ్ యువ నటు డు నిఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని నటుడి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . ప్రస్తుతం ఈయన స్వయంభు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం శివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఫార్స్ ఫిల్మ్ సంస్థ వారు ఏకంగా 7 కోట్ల భారీ ధరకు ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేసిన ఫార్స్ ఫిల్మ్ సంస్థ వారు ఈ మూవీ ని ఓవర్సీస్ ఏరియాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నిఖిల్ కి ఆఖరుగా కార్తికేయ 2 మూవీ తో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈయన నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి తాజాగా ఈయన నటించిన స్వయంభు మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ఈయన కు ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: