ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు, హీరోయిన్లు ఒకే విభాగంలో సెటిల్ కాకుండా ఇతర విభాగాలలో కూడా తమ టాలెంట్ ను నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు హీరోలు , హీరోయిన్లుగా కొనసాగుతూనే మరొకవైపు నిర్మాతలుగా మారి సక్సెస్ అవుతున్నారు.. ఉదాహరణకు హీరోయిన్ సమంత.. స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. కొన్ని వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమై.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. శుభం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. చిన్న సినిమానే అయినా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అటు హీరో నాని కూడా ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరొకవైపు పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తూ నిర్మాతగా భారీ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వీరి జాబితాలోకి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయారు. గతేడాది క, ఈ ఏడాది కే ర్యాంప్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు నిర్మాతగా మారి.. తన మొదటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ పాటను రిలీజ్ చేశారు.

విషయంలోకి వెళ్తే..కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న ' తిమ్మరాజు పల్లి టీవీ' సినిమా నుంచి తాజాగా, "చిన్ని చిన్ని గుండెలోన" అనే మెలోడీ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. ఇది బాగా ఆకట్టుకుంటుంది. ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటకు వంశీ కాంత్ రేఖ కంపోజ్ చేయగా .. హరిణి ఇవటూరి, పవన్ కళ్యాణ్ ఆలపించారు. వి మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ పీరియాడిక్ డ్రామా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇకపోతే ఇప్పటికే చాలామంది హీరోలు తమ కెరియర్ ను కొనసాగిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.  ఇప్పుడు వారి జాబితాలోకి కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయారు.  మరి ఈ పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరానికి నిర్మాతగా మంచి విజయాన్ని అందిస్తుందా లేక బెడిసి కొడుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: