రాజ్ నిడిమోరు సమంత..వీరి ప్రేమ డేటింగ్ గురించి సోషల్ మీడియా వ్యాప్తంగా రోజు ఎన్ని వార్తలు చక్కర్లు కొట్టాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సమంత ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె వెంటే ఉంటూ ఊహాగానాలకు తెర లేపారు. దీంతో రాజ్ నిడిమోరు సమంతల డేటింగ్ వార్తలు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేశాయి. అలా చాలా రోజులుగా డేటింగ్ వార్తలతో నెట్టింట్లో హాట్ టాపిక్ గా ఉన్న సమంత రాజ్ నిడిమోరు ఇద్దరు డిసెంబర్ 1న పెళ్లి చేసుకొని అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.అప్పటివరకు అసలు తమ మధ్య ఏమి లేదని కొట్టి పారేశారు. కానీ ఎవరు కూడా వీరి మాటలే నమ్మలేదు. ముఖ్యంగా రాజ్ మొదటి భార్య వీరి జంటను విమర్శిస్తూ పెట్టిన పోస్టులు వీరి మధ్య ఉన్న బాండింగ్ కి మరింత డౌట్లు పుట్టించాయి.

ఇదంతా పక్కన పెడితే డిసెంబర్ ఒకటిన పెళ్లి బంధంతో ఒక్కటైన సమంత రాజ్ నిడిమోరులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే సమంతని పెళ్లి చేసుకున్న రోజు రాజ్ నిడిమోరు ఒక సర్ప్రైసింగ్ గిఫ్ట్ ఇచ్చారట.మరి ఇంతకీ సమంతకి రాజ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే.. సమంత కోసం చాలా రోజుల నుండి ఒక స్పెషల్ ఇల్లుని డిజైనింగ్ చేయించి రాజ్ నిడిమోరు పెళ్లి రోజు గిఫ్ట్ గా ఆ కొత్త ఇంటి తాళాలు ఇచ్చారట. అయితే రీసెంట్ గానే సమంత ఒక కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసినట్టు పలు వీడియోలు, పూజ చేస్తున్న ఫోటోలు చక్కర్లు కొట్టాయి.అయితే ఇది సమంత రాజ్ తో పెళ్లయ్యాక కలిసి ఉండడం కోసం తన సొంత డబ్బులతో కొనుక్కున్న ఇల్లట.

కానీ సమంతను సర్ప్రైజ్ చేయడం కోసం రాజ్ నిడిమోరు ఆమె ఇష్టానికి తగ్గట్లుగా ఒక ఇల్లుని జూబ్లీహిల్స్ లో కొని ఇంటి తాళాలను పెళ్లిరోజు నాడు సమంత చేతిలో పెట్టి సర్ప్రైస్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారడంతో రాజ్ కి సమంత మీద ఎంత ప్రేమో అంటూ చాలామంది నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక సమంత పెళ్లి రోజు నాడు ధరించిన రింగు కూడా నెట్టింట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.అయితే ఇది గతంలోనే అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోని సమంత చేతికి కనిపించింది.అప్పుడే వీరిద్దరి ఎంగేజ్మెంట్ అయినట్టు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: