
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి తదితరులు.
మ్యూజిక్ : సాయి అభ్యంకర్
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: కీర్తిశ్వరన్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 17
పరిచయం:
‘లవ్ టుడే’తో యూత్‌ని ఆకట్టుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజుతో కలిసి నటించిన తాజా సినిమా ‘డ్యూడ్’. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. పాటలు బ్లాక్‌బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. భారీ అంచనాలతో ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
గగన్ (ప్రదీప్ రంగనాథన్) ప్రేమలో పడి ఫెయిల్ అవుతాడు. పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు). గగన్ కి కుందన మరదలు అవుతుంది. ఆమె తన బావ గగన్‌ను ప్రేమించి చెపితే మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె బెంగళూరు వెళ్లిపోతుంది. తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో మరదలి పై గగన్ మనసులో ప్రేమ పడుతుంది. నేరుగా వెళ్లి మావయ్య ఆదికేశవులకు చెపుతాడు. మామ వారిద్దరికి హ్యాపీగా పెళ్లి చేసేందుకు రెడీ అవుతాడు. ఆ తర్వాత గగన్, కుందన పెళ్లి అవుతుంది. ఇంతలోనే వీరి పెళ్లికి పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది ? ఆ ప్రాబ్లమ్ ఏంటి ? పెళ్లి వద్దని కుందన ఎందుకు అన్నది ?, ఇంతకీ.. పెళ్లి తర్వాత ఏమైంది ?, ఆ తర్వాత గగన్ ఎటువంటి త్యాగం చేశాడు ? పార్ధు (హృదూ హరూన్) ఎవరు ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అన్నది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
లవ్ టుడే, డ్రాగన్ ఆఫ్ రిటర్న్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ప్రదీప్ రంగనాథన్. ఈ రెండు సినిమాలతో బాగా ఆకట్టుకున్న ఈ కుర్రాడు డ్యూడ్ సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. తనదైన స్టైల్ కామెడీ టైమింగ్, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో మెప్పించాడు. పాత్ర వేరియేషన్స్‌కు తగినట్టుగా నటించి సూపర్బ్ అనిపించాడు. హీరోయిన్ మమిత బైజు కూడా ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. శరత్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశాడు. మరో హీరోయిన్ నేహా శెట్టి నటన కూడా బాగుంది. రోహిణి, సత్య... మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు కీర్తిశ్వరన్ కామెడీని టేకాప్ చేసిన తీరు డిఫరెంట్‌గా ఉంది. శరత్‌కుమార్ క్యారెక్టర్‌ను ఇంత ఫన్నీగా రాసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేం. హృదూ హరూన్ క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది. ఎమోషనల్ సీన్లతో పాటు కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది. హీరోయిన్ పాత్రను ఇంకా బాగా రాసుకుని ఉంటే సినిమా రేంజ్ వేరుగా ఉండేది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమా ఇంకా సూపర్ హిట్ అయ్యుండేది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
దర్శకుడు కీర్తిశ్వరన్ తన టేకింగ్‌తో మెప్పించడంలో మంచి మార్కులు వేయించుకున్నా... సెకండాఫ్ స్క్రీన్ ప్లేలో ఇంకా మ్యాజిక్ ఉంటే బాగుండేది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన కీర్తిశ్వరన్ దర్శకుడిగా మారి చేసిన చిత్రం డ్యూడ్. చేసింది మొదటి సినిమే అయిన అనుభవం ఉన్న దర్శకుడిలా తీశాడు. డ్యూడ్ సినిమాకు నేపథ్య సంగీతం బిగ్గెస్ట్ ఫ్లస్ పాయింట్. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యాంకర్ పాటలు బాగున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే పాటలు హిట్ అవ్వడం ప్లస్. సినిమాటోగ్రఫీ సినిమాకు తగినట్టుగా ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా ఉంది. చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా నికేత్ బొమ్మి చిత్రీకరించారు. ఎడిటర్ భరత్ విక్రమన్ చాలా వరకు సినిమాలో సీన్లు క్రిస్పీగానే కట్ చేశారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా...
డ్యూడ్ రొటీన్ ప్రేమకథే అయినా హీరో ప్రదీప్ రంగనాథన్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్, సాయి అభ్యంకర్ సంగీతం, యూత్‌ను మెప్పించే సీన్లు కావాల్సినన్ని ఉండడంతో సినిమా మెప్పిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ నటనను ఎంజాయ్ చేయడానికి థియేటర్‌కు వెళ్ళొచ్చు. ఒకసారి చూడదగిన సినిమా ఇది.
డ్యూడ్ రేటింగ్ : 3 / 5