యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా మూవీ డ్యూడ్.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా.. మమిత బైజు హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కీర్తిశ్వరణ్ డైరెక్షన్ చేశారు.. అయితే ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఇక ప్రదీప్ రంగనాథన్ కి లవ్ టుడే మూవీ తో టాలీవుడ్ లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాగే ఈ ఏడాది వచ్చిన డ్రాగన్ మూవీ కూడా ప్రదీప్ రంగనాథన్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.అలా ఈయన సినిమాలకి మంచి రెస్పాన్స్ ఉండడంతో డ్యూడ్ మూవీ ని కూడా భారీ అంచనాలతో విడుదల చేశారు.. అలా భారీ అంచనాలతో విడుదలైన డ్యూడ్ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదల అయిపోయింది.ఇక సినిమా చూసిన ప్రేక్షకులందరూ అంతా బాగానే ఉంది కానీ ఆ ఒక్క మైనస్ లేకుంటే సినిమా మరింత అద్భుతంగా ఉండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

మరి ఇంతకీ డ్యూడ్ మూవీలో ఉన్న ఒక్క మైనస్ ఏంటయ్యా అంటే సెకండాఫ్ లో ఉండే ఎమోషనల్ సన్నివేశాలు కాస్త ఈజీ వేలో అందరూ అర్థం చేసుకునేలాగా ప్రజెంట్ చేశారు.ఎమోషన్ సీన్స్ కాస్త డెప్త్ గా తీసి ఉంటే మాత్రం సినిమా మరో లెవెల్ లో ఉండేదని అంటున్నారు. అలాగే ఫస్టాఫ్ లో కామెడీ,సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషన్స్ సీన్స్ లో కాస్త డెప్త్ తగ్గడంతో పాటు కామెడీ కూడా సరిగ్గా పండలేదు.

దాంతో సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు సెకండాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలను ఇంకా బాగా రాసుకుంటే బాగుండు..సినిమా మరింత అద్భుతంగా ఉండేది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఓవరాల్ గా సినిమాలోని మ్యూజిక్..హీరో హీరోయిన్ల యాక్టింగ్.. డైరెక్షన్.. ఇలా ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది.అలా సెకండాఫ్ లో వచ్చిన చిన్న మైనస్ తప్ప మిగతాదంతా బాగుంది అని అంటున్నారు. మరి చూడాలి ప్రదీప్ రంగనాథన్ కి డ్యూడ్ మూవీ ఎంత పేరు తెచ్చి పెడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: