
జగన్ యూరప్ పర్యటనకు అనుమతి వేల సిబిఐ కోర్టు తన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి తో సహా పర్యటన వివరాలను సమర్పించాలని విధించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత మొబైల్ నెంబర్ బదులుగా మరొక నెంబర్ ఇచ్చారు అంటూ కోర్టులో దాఖలు చేసినటువంటి మెమోలో సిబిఐ వెల్లడించింది. దీంతో ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ ఆరోపణలు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేయాలి అంటూ సిబిఐ విజ్ఞప్తి చేసింది కోర్టుకు. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ జగన్ తరఫున న్యాయవాదికి సిబిఐ కోర్టు మెమోను జారీ చేసింది.
జగన్ తన కుమార్తెలను చూడడానికి విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోగా జగన్ పిటిషన్ పైన విచారించిన సిబిఐ ప్రత్యేకించి మరి కోర్టు యూరప్ పర్యటనకు అనుమతించింది. అక్టోబర్ 1 నుంచి 30 తేదీ మధ్య 15 రోజులపాటు ఈ యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతులను మంజూరు చేశారు. ఇక అనంతరం పర్యటన ముగిసిన తర్వాత స్వయంగా కోర్టుకు హాజరు కావాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. జగన్ ఈనెల 11న యూరప్ పర్యటనకు వెళ్లారు.మరి తాజా పిటీషన్ పై జగన్ తరపున న్యాయవాది మాత్రం జగన్ ఎప్పుడూ కూడా కోర్టు షరతులను ఉల్లంఘించలేదంటూ తెలియజేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి ఈ రోజున విచారణ చేపట్టబోతున్నారు.