కోలీవుడ్ బ్యూటీ త్రిష విపరీతమైన జంతు ప్రేమికురాలు అన్న విషయంతెలిసిందే. ఇప్పటివరకు చెన్నైలోని కుక్కల సంరక్షకురాలిగా మారిన త్రిష ఒక మనిషి నిండు ప్రాణాన్నితీసిన పులికి ప్రాణభిక్ష పెట్టండి అంటూ దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీకి విన్నవించుకుంది అనే వార్తలు వస్తున్నాయి. రోడ్డు పక్కన కుక్క కనిపిస్తే చాలు వెంటనే కారు ఆపి దాన్ని తీసుకెళ్లి సంరక్షణ బాధ్యతలు చేపట్టే త్రిష ఒక పులి ప్రాణం కోసం చేస్తున్న హంగామా ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఆశక్తి కలిగించే ఈవిషయం వివరాలలోకి వెళ్ళితే ఇటీవల ఢిల్లీలోని జంతుశాలను సందర్శించడానికి వెళ్లిన ఒకవ్యక్తి అదుపు తప్పి తెల్లచారల పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  దీంతో ఆ పులిని చంపేయాలంటూ చాలామంది దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీని కోరుతూ ట్విట్టర్‌లో కామెంట్స్ ను పోస్టు చేస్తున్నారు. అయితే ఈ వార్తలను చూసిన త్రిష ఖంగారు పడి ఎక్కడ ఆ తెల్లచారల పులిని చంపెస్తారో అని భయపడి ఆ పులిని చంపవద్దు అంటూ ఈ బ్యూటీ రాష్ట్రపతికి విన్నవించుకుంటూ తన ట్విటర్ లో ట్విట్ పోస్టు చేసింది అనే వార్తలు వస్తున్నాయి.  అయితే చాలామంది సామాన్యుల ప్రాణాలకే విలువ లేని నేటి పరిస్థితులలో త్రిష పులి పై చూపెడుతున్న జాలిలో కొంత భాగం అయినా సామాన్యుల పై కూడా చూపెడితే బాగుంటుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: