మెగాస్టార్ చిరంజీవి నటించిన అప్ కమింగ్ చిత్రం “బ్రూస్ లీ”. ప్రస్తుతం బ్రూస్ లీ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో ఫంక్షన్ తో, “బ్రూస్ లీ” మూవీపై అభిమానుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.


ఇదిలా ఉంటే ఈ మూవీలో చిరంజీవి నటించటంతో, మూవీపై మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పటి వరకూ బ్రూస్ లీ మూవీపై వచ్చిన టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ రామ్ చరణ్ పైనే వచ్చాయి. ఇప్పుడు మెగాస్టార్ కి సంబందించిన బ్రూస్ లీ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.


మెగాస్టార్ నటించిన సీన్స్ కి సంబంధించిన ఎడిటింగ్ పూర్తైంది. ఆ సీన్స్ కి సంబంధించిన గ్రాఫికల్ వర్క్ ని పూర్తి చేస్తున్నారు.  మరోవైపు చిరుకి సంబంధించిన బ్రూస్ లీ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రెడీ చేస్తుంది. ఈ టీజర్ లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్ ని కూడ పొందుపరిచారు.


ప్రస్తుతానికి రఫ్ కట్ ని పూర్తి చేసుకున్న ఈ టీజర్, రెండు,మూడు రోజుల్లో బయటకు రానుంది. పోస్ట్ ప్రొడక్షన్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బ్రూస్ లీ చిరు టీజర్ అదుర్స్ అని అంటున్నారు. బ్రూస్ లీ మూవీ అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: