బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2008లో ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ అంతకంతకు ఎదుగుతూ వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో t20 ఫార్మాట్ కి ఊహించని రీతిలో పాపులారిటీ రావడానికి ఒకరకంగా అటు బీసీసీఐ నిర్వహించే ఐపిఎల్ కారణం అనడంలో సందేహం లేదు  టి20 ఫార్మాట్ అనే పదానికి అసలు సిసలైన చిరునామాగా కొనసాగుతూ ఉంటుంది ఐపీఎల్. అయితే దేశ విదేశాల నుంచి ఆటగాళ్లు వచ్చి ఈ టోర్నీలో పాల్గొంటూ ఉంటారు.



 అయితే ఈ టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఫైనల్ మ్యాచ్ జరిగే వరకు ఒక రకంగా ఇండియాలో క్రికెట్ పండగ కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ను అటు అభిమానులు అందరూ కూడా పొందుతూ ఉంటారు. కానీ ఐపీఎల్ 17వ సీజన్ మాత్రం ఎప్పటిలాగా ఉత్కంఠ భరితంగా కాకుండా కాస్త చప్పగా సాగుతుంది. సాదరణంగా బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరి పోరు జరిగితేనే.. ఏ క్రికెట్ మ్యాచ్ అయినా సరే ఇక ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఐపీఎల్ లో ఈసారి అలా జరగడం లేదు. బ్యాట్ దే ఆధిపత్యం కొనసాగుతోంది. ఒక్క మ్యాచ్ లో కాదు అన్ని మ్యాచ్లలో కూడా.


 దీంతో గత సీజన్స్ తో పోల్చి చూస్తే ఈ ఐపిఎల్ సీజన్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోతుంది అనే వాదన కూడా వినిపిస్తుంది. సాధారణంగా స్వీట్ అనేది అప్పుడప్పుడు తింటేనే బాగుంటుంది. రోజంతా స్వీటే తినాలంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. ఇక బోర్ కొ
డుతుంది  క్రికెట్లో పరుగులైన అంతే ఈ ఏడాది ఐపిఎల్ లో బ్యాట్స్మెన్లు అలవోకగా సిక్సర్లు బాధిస్తుంటే బౌలర్లు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో బ్యాటర్లు తన నైపుణ్యంతో పైచేయి సాధిస్తే ఆ కిక్కే వేరు. కానీ బౌలర్ ఎవరైనా ఊచకోత అంటే ఏంటో చూపిస్తున్నారు బ్యాట్స్మెన్లు. దీంతో ఐపీఎల్ లో ఉండే మజా మిస్ అవుతుంది   దీనికి కారణం ఇంపాక్ట్ ప్లేయర్ రూలా.. లేకపోతే చిన్న బౌండరీల? బ్యాటర్ నైపుణ్యమా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl