అమెరికాలో భారత సతతికి చెందిన గూగుల్ సీఈవో సుదర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది. టెక్నాలజీ అభివృద్ధి రంగంలో సుదర్ పిచాయ్ చేసిన విప్లవాత్మకమైన మార్పులు, సేవలకి గాను పిచాయ్ ని ఈ అవార్డు వరించింది. అమెరికా భారత్ వాణిజ్య మండలి ప్రతీ ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ కి పిచాయ్ ని ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది.

 Image result for sundar pichai

పిచాయ్ తో పాటుగా, నాస్‌డాక్‌ ప్రెసిడెంట్‌ అడెనా ఫ్రైడ్‌మాన్‌ పేరుని కూడా ఈ సంస్థ ప్రకటించింది. వీరు ఇద్దరి నేతృత్వంలోని వారు పని చేస్తున్న కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగలో ఉత్తమమైన వారధిని ఏర్పాటు చేయడంలో తమ వంతు కీలక పాత్రలని పోషించినట్లుగా తెలిపింది.

 Image result for sundar pichai

ఈ రెండు సంస్థల కారణంగా భారత్ అమెరికా మధ్య వస్తు, సేవల వాణిజ్యం జరిగిన ఐదేళ్ళలో 150 శాతం పెరిగిందని గత ఏడాదికి 142.1 బిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపింది.ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్‌ సదస్సులో వీరికి ఈ అవార్డ్ లు ఇవ్వనున్నట్లుగా అమెరికా భారత్ వాణిజ్య మండలి ప్రకటించింది  


మరింత సమాచారం తెలుసుకోండి: