
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది.. ఈ కరోనా వైరస్ బారిన ఇప్పటికే 8లక్షలమందికిపైగా పడ్డారు... అందులో 42వేలమందికిపైగా ప్రాణాలు విడిచారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ వంటి ప్రముఖ దేశాల్లో విలయతాండవం చేస్తుంది. దీంతో ఈ కరోనా వైరస్ ను అంతం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో అమెరికా కూడా చైనా వ్యూహంతోనే ముందడుగు వేస్తుంది.
అయితే ఈ వ్యూహంతో అమెరికా కరోనా వైరస్ కు చెక్ పెడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అసలు ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. నిజానికి కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ ఇప్పుడు ఒక్క కేసు కూడా చైనాలో లేదు. దీనికి కారణం వారు తీసుకున్న కఠిన చర్యలే. కరోనా వైరస్ అంటూ వ్యాధి అని తెలిసిన రోజే చైనా లాక్ డౌన్ విధించింది. అది సాధారణ లాక్ డౌన్ కాదు ఇంటి నుండి ఏ ఒక్కరు బయటకు రాకుండా.. నిత్యావసర సరుకులకు కూడా 10 రోజులకు ఒకసారి బయటకు వచ్చేలా నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు.. అపార్ట్మెంట్ లో ఎవరు బయటకు వెళ్తున్నారు.. ఎన్ని సార్లు వెళ్తున్నారు.. ఎవరు లాక్ డౌన్ ఉల్లంగిస్తున్నారు అనేది అంత నిఘా పెట్టి కనుక్కొని వారిపై కఠిన చర్యలు తీసుకొని.. కరోనా పాజిటివ్ అని తేలిన వారిని ఖ్వారంటైన్ లోకి నెట్టి కఠినంగా వ్యవహరించిన కరోనా వైరస్ ను తరిమి కొట్టింది. ఇంకా అలాంటి ఈ వ్యూహాన్నే అమెరికా కూడా వెయ్యాలి అనుకుంటుంది. నిజంగానే అమెరికా కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుందా? అమెరికా కూడా కరోనా కట్టడి చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple