ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలమౌతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ దెబ్బకి అన్ని రంగాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీనితో వారి వివిధ కంపెనీలు వారి ఉద్యోగులను తీసి వేస్తూనే ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే కరోనా లాక్ డౌన్ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజు కొంటునప్పటికీ ఉద్యోగాల కోత మాత్రం ఆగట్లేదు. ఇక కేవలం గత వారం ఒక్కటే దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది కొత్తగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అక్కడి అధికారులు ఆ విషయాన్ని తెలిపారు.

IHG


దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రయోజనాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అమెరికాలో 4.1 కోట్లకు చేరుకుంది. దీన్నిబట్టి అమెరికాలో కరోనా సంక్షోభం వ్యాపారాలపై ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఏప్రిల్ నెలలో అమెరికాలో నిరుద్యోగ రేటు 14.7 శాతానికి చేరుకుంది. మహా మాంద్యం తర్వాత ఇదే అత్యధికం అని చెప్పవచ్చు. ఇకపోతే ఇది ఈనెల పూర్తయ్యేసరికి ఇది 20 శాతం వరకు వెళ్లవచ్చని అక్కడి వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ దేశ లేబర్ డిపార్ట్మెంట్ కూడా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 


కరోనా సమయంలో 2.5 కోట్ల మంది నిరుద్యోగ భృతిని పొందగలరని ఇది ప్రస్తుతం 2.1 కోట్లకు చేరిందని తెలుస్తోంది. దీనికి కారణం సడలింపులు కారణంగా తెలుసుకున్న కంపెనీలు మళ్లీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అని అర్థమవుతుందని తెలియజేసింది. ఇకపోతే ఈ రెండు అంకెల నిరుద్యోగ రేటు 2021 సంవత్సరంలో కూడా మొత్తం కొనసాగవచ్చని అక్కడి కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా దేశంలో కరోనా దెబ్బకి లక్ష మంది పైన మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: