అయోధ్య రామ మందిరం... ఎందరో హిందువులకు ఒక కల... రామ మందిరం చూస్తామా అని ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. రామ మందిర నిర్మాణం కోసం చాలా మంది ఎదురు చూసారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రామ మందిరం గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ మందిర నిర్మాణం విషయంలో ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం  కూడా చాలా వరకు దూకుడుగా వ్యవహరిస్తుంది. రెండు ఇదిలా ఉంటే ఇప్పుడు అయోధ్య  రామాలయ నిర్మాణం కోసం భారీగా విరాళాలు కూడా వస్తున్నాయి. రామ జన్మభూమి ట్రస్ట్ కి విరాళాలు పంపిస్తున్నారు.

ఇప్పుడు  రామ జన్మభూమి ట్రస్ట్ కి  విరాళాలు ఎన్నారై లు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, మెక్సికో వంటి దేశాల్లో ఉన్న ఎన్నారై సంస్థలు అన్నీ కూడా భారీగా విరాళాలు ఇవ్వడానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. తెలుగు నుంచి తానా సహా వంటి సంస్థలు ఇవ్వడానికి గానూ ఇప్పుడు చర్చలు జరుపుతున్నాయి. భారీగా ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి అని తెలుస్తుంది. కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ తో కూడా చర్చలు జరుపుతున్నాయి సదరు సంస్థలు.

విదేశాల్లో ఉన్న కొన్ని హిందుత్వ సంస్థలు కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది.  హిందుత్వ సంస్థలకు చెందిన కొందరు ఇప్పుడు సేవా కార్యక్రమాల కు కూడా విదేశాల్లో సిద్దమవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా లో దీనికి సంబంధించి ఇప్పటికే క్యాంపెయిన్ కూడా చేయడం మొదలుపెట్టారు అని తెలుస్తుంది. అమెరికా నుంచి కొన్ని  హిందుత్వ సంస్థలు, యోగా శిక్షణ వంటి  సంస్థల నుంచి కూడా భారీగా నిధులు వస్తున్నాయి  అని తెలుస్తుంది.  కాగా ఆగస్ట్ 5 న రామాలయ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: