అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనగానే ఇప్పుడు చాలా వరకు కూడా భారతీయులు ఎటు మద్దతు ఇస్తారు అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. భారతీయులు చాలా మంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయన మళ్ళీ అధ్యక్షుడు అయితే ఇండియా విషయంలో ఎలా వ్యవహరిస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ట్రంప్ అమెరికాకు తిరిగి ఎన్నిక అయితే ఇండియన్స్ చాలా మంది ఉద్యోగాలు కూడా  కోల్పోయే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మన దేశ  వ్యాప్తంగా కూడా చాలా మంది  అమెరికా వెళ్లి ఉంటారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఎన్నారైలలో ఉద్యోగాలు చేసుకునే చాలా మంది ఓటు వేసే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ వ్యాపారాలు చేసే వారు మాత్రమే ఆయనకు ఓటు వేయడమే గాని ఉద్యోగులు అసలు తమ ఉద్యోగాల విషయంలో ఆందోళనగా ఉన్నారని అంటున్నారు. ట్రంప్ దాదాపుగా అన్ని దేశాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నారు. ట్రంప్ కి ఇవే ఆఖరి ఎన్నికలు కావడంతో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండవచ్చు.

దానితో  భారతీయులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉండవచ్చు. ట్రంప్  సాధారణంగా వ్యాపారవేత్త కావడంతో ఆయనకు వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి గాని దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశాలు చాలా తక్కువ. అమెరికన్స్ దృష్టి లో మంచి వ్యక్తి అనిపించుకోవడానికి ఆయన వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. లేదా ఇండియా  వంటి దేశాలతో వ్యాపారాల కోసం ఆయన ఇండియా వారికి అనుకూలంగా అయినా నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ట్రంప్ తీరుపై మాత్రం ఇప్పుడు చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. మరి ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇండియా వాళ్లకు మాతరం భయాలు చాలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: