అమెరికా అధ్యక్షుడు మారిన తర్వాత భారతదేశంతో ఆ దేశం  వివాదాస్పదంగా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఎన్నికల్లో గెలవకుండా ఉండటానికి మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయత్నం చేశారని మాజీ అధ్యక్షుడు గెలవడానికి ఆయన అన్ని విధాలుగా సహకరించాలని కొంతమంది ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన బహిరంగ సభలు కూడా వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మన దేశంలో కరోనా వ్యాప్తికి పెరగడానికి ప్రధాన కారణం నమస్తే ట్రంప్ కార్యక్రమం కూడా ఒక కారణం అనే భావన కూడా చాలామంది వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికా భారతదేశంతో వివాదాస్పదంగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా లక్ష దీవులకు సమీపంలో అమెరికా నౌకా ఒకటీ హల్ చల్ చేసింది. స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కును చాటేందుకు భారత ప్రాదేశిక జలాలోకి తమ నౌకాదళం ఒక ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా పేర్కొంది. ఇందుకోసం ఇండియా ముందస్తు అనుమతి తీసుకోలేదని అమెరికా స్పష్టం చేసింది. భారత్ కోరుతున్న మితిమీరిన సముద్ర ప్రాదేశిక హక్కులను సవాల్ చేసేందుకు ఈ నెల 7న ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది.

ఇందులో క్షిపణి ప్రయోగ సామర్థ్యం ఉన్న విధ్వంసక నౌక యు ఎస్ ఎస్ జాన్ పాల్ జోన్స్ పాల్గొన్నట్టు అమెరికా వెల్లడించింది. లక్షదీవుల కు పశ్చిమాన 130 నాటికల్ మైళ్ల దూరంలో భారత ప్రత్యేక ఆర్థిక మండలి గుండా ప్రయాణం చేసినట్టు అమెరికా వెల్లడించింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇలా చేశామని అమెరికా పేర్కొంది. అమెరికా బలగాలు రోజువారీగా భారత్ పసిఫిక్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి అమెరికా వెల్లడించింది. ఇలాంటివి గతంలో కూడా చేశామని భవిష్యత్తులో కూడా చేస్తామని అమెరికా స్పష్టంగా పేర్కొన్నది. ఏదో ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదా రాజకీయ ప్రకటనలు చేయడం వీటి ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చింది అమెరికా.

మరింత సమాచారం తెలుసుకోండి: