కృష్ణా జిల్లాలో హాట్ సీటు ఏదైనా ఉంది అంటే మైలవరం...మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈ సారి టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో దేవినేని విజయం సాధించారు. ఇక మూడో సారి కూడా బరిలోకి హ్యాట్రిక్ కొట్టేందుకు దేవినేని చూస్తున్నారు. అయితే 2014లో గెలిచి మంత్రి అయిన దేవినేని నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదని టాక్ ఉంది. అలాగే నియోజకవర్గంలో అభివృద్ది పనులు విషయంలో కొంత మందికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇక దేవినేని ఇరిగేషన్ మంత్రి కావడంతో... దగ్గర ఉండి మైలవరానికి నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు బాగానే చేయించారని తెలుస్తోంది. 
అలాగే ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరోసారి తనని గెలిపిస్తాయని దేవినేని నమ్ముతున్నారు.


అటు వైసీపీ దేవినేనిని గట్టిగానే టార్గెట్ చేసింది. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయిన జోగి రమేశ్‌ని పెడన పంపి....దేవినేని చిరకాల రాజకీయ ప్రత్యర్ధి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్‌ని మైలవరం బరిలోకి దింపారు. ఇక వసంత మైలవరంలో అడుగుపెట్టింది మొదలు...ఉమాపై అవినీతి ఆరోపణలతో విరుచుకు పడుతున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని….నేతలనీ, కార్యకర్తలని కలుపుకుంటూ ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు. సామాజిక పరంగానూ, ఆర్ధిక పరంగానూఉమాకి ధీటైనా అభ్యర్ధి కావడంతో...ఈసారి ఎన్నికల్లో మైలవరంలో హోరా హోరీ పోరు నడవడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇక రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ల ప్ర‌కారం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇటు ఉమా, అటు కేపీ ఇద్ద‌రు ఒక్కొక్క‌రు రూ.100 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఏపీలోనే అత్యంత ఖ‌రీదైన నియోజ‌క‌వ‌ర్గంగా మైల‌వ‌రం నిలుస్తుంద‌ని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే మైలవరంలో బీసీలు గెలుపోటములని నిర్ణయించే శక్తిగా ఉన్నారు. వారు ఎక్కువ ఎటువైపు మొగ్గు చూపితే వారి విజయం సులువనే చెప్పాలి. అలాగే ఇక్కడ కొన్ని మండలాల్లో రెడ్డి సామాజికవర్గం, కొన్ని మండలాల్లో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందటంతో....ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి రాబోయే ఎన్నికల్లో దేవినేని హ్యాట్రిక్ కొడతారా...లేక వైసీపీ దేవినేనికి చెక్ పెడుతుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: