ఒక వైపు జగన్ ఇంకో వైపు చంద్రబాబు అందులోనూ అవి అసెంబ్లీ సమావేశాలు ఇక చెప్పేదేముంది తూటాల్లాంటి మాటలు ఆరోపణలు విమర్శలు సెటైర్లు ఒకటేంటి ఏపీ పొలిటికల్ స్క్రీన్ మొత్తం ఒక రేంజ్ లో వేడెక్కిపోయింది. అంతలోనే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏపీని ఆవరించిందటా గతంలో ఎన్నడూ ఇలాంటి పొలిటికల్ వెదర్ ని చూడలేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతుంది. ఇటు వైసిపి, అటు టిడిపి మధ్యలో అలజడి రేపుతున్న బీజేపీ. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఏపీ రాజకీయాల్లో ఏమాత్రం వేడి తగ్గలేదు.



అదే సమయంలో బడ్జెట్ సమావేశాలు మొదలు కావడంతో పొలిటికల్ కి ఒక స్థాయిలో పెరిగిపోయింది. వైసిపి టిడిపి మధ్య పేలిన మాటల తూటాలు ఎదురుదాడి వ్యూహాలతో పొలిటికల్ పిక్చర్ భగ్గుమంది. ఇంత దారుణంగా ఇన్ని  స్కామ్ లు చేసి మల్లి ఏమీ జరగనట్టుగా ఏకంగా ఇక్కడ కూర్చుని వీళ్ళు మాట్లాడతా ఉన్న మాటలు చూస్తుంటే మనుషులు అని కాదు అని,రాక్షసుడు అని జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు. జస్ట్ ఇప్పుడే ఎన్నికలు పూర్తైయ్యాయన్న భావన కలగదు. ఆ స్థాయిలో అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధం చేశాయి.



కానీ అసెంబ్లీ సమావేశాలు పూర్తికావడంతోనే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇజ్రాయిల్ వెళ్లారు. అటు ప్రతి పక్షనేత చంద్రబాబు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. సీఎం ఏపిలో లేరు, అటు ప్రతి పక్షనేత రాష్ట్రంలో లేరు. నిన్నటిదాకా ఒక స్థాయిలో రాజకీయాన్ని వేడెక్కించిన ఇద్దరు విదేశీ పర్యటనలకు సై అనడంతో అమరావతి ఆన్ వెకేషన్ అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతుందట. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లడం ప్రతిపక్షనేత ఫారెన్ వైపు చూడటం చర్చనీయాంశం కాదు చాలా సాధారణం.


కానీ ఒకేసరి సీఎం, అపోజిషన్ లీడర్ ఇద్దరూ విదేశాల్లో ఉండడం మాత్రం అరుదుగా జరిగే పరిణామమే చంద్రబాబు హెల్త్ కు సంబంధించిన కారణాలతో అమెరికా వెళితే జగన్ పర్యటన మాత్రం పూర్తిగా వ్యక్తిగతం. జగన్ చంద్రబాబు కేవలం ఆయా పార్టీల అధినేతలు మాత్రమే కాదు ఒకరు ముఖ్యమంత్రి మరొకరు ప్రతిపక్షనేత ఇద్దరూ లేకపోవటంతో ఈ పరిస్థితి మీదా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: