తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీని  కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో వినూత్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారు . అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో  హామీని నెరవేరుస్తూ 5 నెలలోనే ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చారు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అంతేకాకుండా ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక  పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

 

 

 

 కాగా తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో పథకం తో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం జగన్ సర్కార్ కొత్త పథకం  తీసుకురాబోతున్నట్లు  సమాచారం. దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల బైక్లను ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లుగా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగులను  ప్రోత్సహించేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. దీని కోసమే ఈ ఉచిత మూడు చక్రాల బైక్లను ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే దీనికోసం మొదటి విడతలో భాగంగా 2500 మంది దివ్యాంగులకు మూడు చక్రాల బైకులు ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. దానికిగాను 22 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే జగన్ సర్కార్ పంపిణీ చేసే  ఈ మూడు చక్రాల బైక్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దివ్యాంగులు దరఖాస్తు ఫారాలను గ్రామ వాలంటీర్లకు అందించాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న దివ్యాంగులు తమ దరఖాస్తు ఫారం కి అది కూడా జత చేయాల్సి ఉంటుంది. మూడు చక్రాల బైక్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించిన తర్వాత ఎవరెవరికి మూడు చక్రాల బైక్ లు  ఇవ్వాలనేది నిర్వహించనున్నారు. ఇక ఎవరెవరికి  మూడు చక్రాల బైకులు మంజూరయ్యే అనేది గ్రామ వాలెంటర్ల్లు పంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డులో ద్వారా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: