రాష్ట్రంలో బిజెపి, వైసిపి మధ్య రాజకీయ సంబంధాలు ఉప్పు, నిప్పులా ఉన్నాయి. అధికార పార్టీ ఏ పని చేసినా, దాన్ని విమర్శించేందుకు టిడిపితో కలిసి బిజెపి ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ కేంద్రంలో మాత్రం జగన్ తో సానుకూలంగానే ఉన్నట్టుగా బిజెపి అగ్రనాయకులు వ్యవహరిస్తున్నారు. జగన్ కు ఏ అవసరం వచ్చినా, తామున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో వైసీపీని కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా బిజెపి ఆఫర్ ఇస్తున్నా, జగన్ తిరస్కరిస్తున్నారట. ప్రస్తుతం బిజెపి పార్లమెంట్ లోనూ, రాజ్యసభలోనూ బలంగా ఉంది. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది. లోక్ సభ లో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో ప్రస్తుతం గెలిచిన సభ్యులతో కలిసి ఆరుగురు సభ్యులు ఉన్నారు.

 

IHG


 భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, వైసీపీ తో బీజేపీ ప్రభుత్వానికి చాలా అవసరాలు ఉన్నాయి. అందుకే రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మరీ, బిజెపి ప్రభుత్వంలో చేరాల్సిందిగా వైసీపీకి ఆఫర్లు ఇస్తున్నా, జగన్ మాత్రం ఆ ఆఫర్ ను తీసుకునేందుకు ఇష్ట పడటం లేదట. దీని వెనుక కారణాలో చాలానే ఉన్నాయి. వైసిపి ఈ స్థాయిలో విజయం సాధించింది అంటే, దానికి దళితులు, మైనారిటీ ఓటు బ్యాంకే కారణం. సామాజికంగా ఈ రెండు వర్గాలు బీజేపీ అంటే ఇష్టపడవు. ఒకవేళ బీజేపీ తో కలిసినా, రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలనే ఆలోచనతో జగన్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

 


అందుకే కేంద్ర మంత్రి మండలిలో చేరే విషయంలో జగన్ పెద్దగా ఆసక్తి చూపించనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి మండలి చేరకపోయినా, బీజేపీతో ఢిల్లీ స్థాయిలో సన్నిహితంగా ఉంటూ, ఏపీకి కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఢోకా లేకుండా చేసుకోవాలని, అవసరమైన సందర్భంలో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉండడం తోనే ప్రధాని మోదీ ఇస్తున్న ఆఫర్ ను జగన్ తిరస్కరిస్తున్నట్లుగా అర్ధం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: