రాజకీయ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ, సఖ్యతగా ఉన్నా, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక అంశంపై వారి మధ్య వివాదాలు రావడం సర్వసాధారణం. ఇప్పుడు వైసీపీ, బీజేపీ మధ్య ఇదే రకమైన వివాదం చెలరేగింది. అభ్యుదయ రచయిత వరవరరావు ను అరెస్ట్ చేయడం, ఆయనను జైలులో పెట్టడం వంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నాడు అనే కోణంలో కేంద్రం వరవరరావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి నెల రోజుల క్రితం వరవరరావుని విడుదల చేయవలసిందిగా కోరుతూ లేఖ రాశారు.

అప్పట్లో ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ సోషల్ మీడియా వేదికగా స్పందించి భూమన కరుణాకర్ రెడ్డి లేఖపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు ప్రధాని నరేంద్రమోదీ వంటి వారి హత్యకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని ఎలా సమర్ధిస్తున్నారు అంటూ... వైసీపీపైన ఆయన విమర్శలు చేశారు. ఈ వ్యవహారంతో ఉలిక్కిపడిన జగన్  దీనిపై బిజెపికి క్లారిటీ ఇవ్వాల్సదిగా సూచించారట. ఈ మేరకు భూమన కరుణాకర్ రెడ్డి బిజెపిని ఉద్దేశించి లేఖను రాశారు.

'53 సంవత్సరాలుగా ఆయుధం పట్టి సాయుధులై తిరిగే వాళ్ళు సాధించలేని విప్లవం ఓ వృద్ధుడు సాధించగలరా అని తెలియజేశాను' నేను రాడికల్ అని మాత్రమే తెలుసు. 1969 70 లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో నా రాజకీయం ప్రారంభమైంది. అప్పట్లో తిరుపతి ఆర్ఎస్ఎస్ ప్రచారకులు బారా నా పట్ల అభిమానంతో ఉండేవారు. సాయుధ పోరాట మార్గం పట్ల, హింస ఆయుధంగా గల వారి పట్ల నాకు సముఖత లేదు. అహింసా పరమధర్మం. క్షమ ఉత్తమ గుణం అనే హైందవ వాదం నేను బలంగా నమ్ముతాను.  అనారోగ్యంతో ఉన్న ఓ 81 సంవత్సరాల వృద్ధుడు పై జాలి చూపించమని కోరడం నేరం అని మీరు భావిస్తే ఏం చెప్పను నమస్కరించడం తప్ప.


46 సంవత్సరాల క్రితం వరవరరావు గారు నేను భారత ఉపరాష్ట్రపతి గారు జైలు లో కలిసి ఉన్నాం కాబట్టి నేను వెంకయ్య గారికి వ్యక్తిగతంగా లేఖ రాశాను.నాగేశ్వరరావు గారిని విడుదల చేయమని, చాలామంది మేధావులు లేఖరాశారు. వారందరిని దేశ బహిష్కరణ చేయమని కోరడం న్యాయంగా ఉంటుందా ? తరతరాల భారత సంస్కృతి నేర్పిన క్షమాగుణంవైపు న్యాయం వైపు ,ధర్మం వైపు మనిషి వైపు, నిలబడడం మీ దృష్టిలో నేరమైతే ఆ నేరం నేను నిరంతరం చేస్తూనే ఉంటాను.

మిత్రమా భారత ప్రధాని పట్ల అపార గౌరవం అభిమానం ప్రేమ ఉన్నాయి. ఆయన మన అందరికీ అభిమాన నాయకుడు. నా వ్యక్తిగత అభిప్రాయానికి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మీరు ముడిపెడుతూ  రాయడం బాధ కలిగించింది. నవ్వు కూడా తెప్పించింది. చివరగా శత్రువుని చంపడం కాదు, క్షమించడం పెద్ద శిక్ష అని నమ్ముతాను ఆపై మీ విజ్ఞత. అంటూ బీజేపీని సుతిమెత్తగానే విమర్శిస్తూ, ఈ వ్యవహారంలో వైసీపీ కి సంబంధం లేదని, పూర్తిగా  బాధ్యుడిని తానే అన్నట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంతో బిజెపి వైసిపి మధ్య కాస్త దూరం పెరిగినట్లు గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: